కాపు ఉద్యమ నేతగా పగ్గాలు చేపట్టిన మాజీ ఎంపీ రామజోగయ్య..!

Wednesday, August 12th, 2020, 09:00:59 AM IST

కాపు ఉద్యమ నేతగా మాజీ ఎంపీ చేగొండి వెంకట హరి రామజోగయ్య బాధ్యతలు చేపట్టారు. కొద్దిరోజుల క్రితం కాపు ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం రాజీనామా చేయడంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యతలను రామజోగయ్య తీసుకున్నారు. ఇందుకోసం ఆయన కాపు సంక్షేమ సేనను కూడా స్థాపించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామజోగయ్య జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం కాపు రిజర్వేషన్‌ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని కేంద్రం పరిధిలోనిది అని జగన్ అన్నారని, ఎన్నికలఓ గెలిచి అధికారం చేపట్టాక కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కాపు నేస్తం పేరుతో కేవలం 2.50 లక్షల మంది మహిళలకు ఏడాదికి 15 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కాపు సామాజిక వర్గం బీసీలా లేక ఈబీసీలా అనేది తేలకుండా రిజర్వేషన్‌ అంశాన్ని వదిలేసిందని అన్నారు. కాపులను బీసీలుగా ప్రకటించడం లేదా ఓసీలలో 10 శాతం ఈబీసీ కోటాలో జనాభా ప్రాతిపదికన తమకు రిజర్వేషన్‌ కల్పించాలని రామజోగయ్య డిమాండ్ చేశారు.