బిగ్ న్యూస్: సీఎం జగన్ పై పెద్ద కుట్ర – రామ్ పోతినేని

Saturday, August 15th, 2020, 03:23:25 PM IST

గత కొద్ది రోజుల క్రితం విజయవాడ లో స్వర్ణ పాలస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కోవిడ్ రోగులు సైతం మరణించారు. అయితే ఈ ఘటన పై నటుడు రామ్ పోతీనేని స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పెద్ద కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ అందుకు సంబంధించిన పలు పోస్ట్ లను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సీఎం జగన్ ను తప్పుగా చూపించడానికి అని అంటారు.

సీఎం జగన్ గారూ, మీ కింద పని చేసే కొంతమంది, మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వలన మీ రిప్యుటేషన్ కి, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది అని అన్నారు. వాళ్ళమీద ఓ లుక్కేస్తారనీ ఆశిస్తున్నాం అని అన్నారు. అయితే హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది అని, అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా? అని అన్నారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చంసనీయం కాగా, రామ్ పోతీనెని మొదటి సారిగా పొలిటికల్ మేటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.