రామ్ చరణ్ కి కరోనా వైరస్ నెగటివ్

Tuesday, January 12th, 2021, 03:43:35 PM IST

ఇటీవల కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కొగా, అందులో కరోనా వైరస్ నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, రామ్ చరణ్ తో పాటుగా ప్రముఖ మెగా హీరో వరుణ్ తేజ్ సైతం కరోనా వైరస్ భారిన పడగా, వరుణ్ తేజ్ కోలుకున్నారు. తాజాగా రామ్ చరణ్ సైతం కరోనా వైరస్ నుండి కోలుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక తాను కోలుకోవాలని కోరుకున్న వారందరికీ కూడా రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.