జూనియర్ ఎన్టీఆర్ కి ప్రామిస్ చేసిన రామ్ చరణ్…అంతకు మించి ఉండనుందా?

Tuesday, October 6th, 2020, 06:11:28 PM IST

రౌద్రం రణం రుధిరం చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయింది. ఈ చిత్రం కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కూడా ఇక రెగ్యులర్ గా చిత్ర యూనిట్ ప్రేక్షకుల తో పంచుకోనుంది. అయితే చిత్ర షూటింగ్ పునః ప్రారంభం కావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు. RRR సెట్స్ లోనికి మళ్లీ రావడం ఆనందం గా ఉంది అని రామ్ చరణ్ తెలిపారు. చాలా రోజుల నుండి ఆగిపోయిన ఒక స్పెషల్ విషయం గురించి రామ్ చరణ్ ఎన్టీఆర్ తో తెలిపారు. ఈసారి అక్టోబర్ 22 న బెస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాం అని, ప్రామిస్ అంటూ రామ్ చరణ్ అన్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు కి సంబంధించిన భీమ్ ఫర్ రామరాజు అనే వీడియో సోషల్ మీడియా లో విపరీతం గా ట్రెండ్ అయింది. రామ్ చరణ్ అభిమానుల ఒక స్పెషల్ ట్రీట్ ల ఉండిపోయింది. అయితే రామరాజు ఫర్ భీమ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే రామ్ చరణ్ సైతం అందుకు సంబంధించిన పోస్ట్ నే పెట్టడం గమనార్హం. అయితే ఈ అక్టోబర్ 22 కోసం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా, రామ్ చరణ్ అభిమానులకు కూడా పండుగ ట్రీట్ ఖాయం అని తెలుస్తోంది.