స్పిరిట్ ఆఫ్ చెన్నై అంటున్న చరణ్.. ప్రభాస్..!

Monday, January 4th, 2016, 02:00:37 PM IST


స్పిరిట్ ఆఫ్ చెన్నై పేరుతో ఓ థీమ్ ఆల్బంను చేసేందుకు చియాన్ విక్రమ్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. విక్రమ్ ఈ ఆల్బం కు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. గత నవంబర్ నెలలో తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అయింది. చెన్నైలో ఎటు చూసిన వరదనీరు కనిపించింది. దాదాపు 42 నుంచి 46 లక్షల మంది ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడ్డారు. సామాన్య ప్రజల నుంచి స్టార్స్ వరకు అందరు వరదల కారణంగా ఇబ్బందులు పడినవారే.

ఇక, వరదల తరువాత చెన్నై నగరం వేగంగా కోలుకున్నది. చెన్నై వాసులను ఆదుకోవడానికి నటులు ముందుకు వచ్చారు. వరదల్లో చిక్కుకున్న వారికి తమవంతు సహాయం అందించారు. ఇకపోతే, తాజాగా చెన్నైను స్పిరిట్ గా తీసుకొని విక్రమ్ దర్శకత్వంలో ఆల్బం చేస్తున్నారు. ఈ ఆల్బంలో సూర్య, కార్తి, ఆర్య, విశాల్ తో పాటు టాలీవుడ్ నటులైన రామ్ చరణ్, ప్రభాస్,రానా, నాని లతో పాటు కన్నడ నటులైన పునీత్ రాజ్ కుమార్ లు కూడా ఈ స్పిరిట్ ఆఫ్ చెన్నై సాంగ్ లో కనిపించబోతున్నారట.