ఆర్ఆర్ఆర్ లో ఆ సన్నివేశాలు కీలకం కానున్నాయా?

Thursday, December 10th, 2020, 10:23:01 AM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం లో ఇటీవల బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సెట్స్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో అలియా భట్ తో రామ్ చరణ్ కలిసి నటించే సన్నివేశాలు కీలకం కానున్నాయి అని తెలుస్తోంది. ఇప్పటికే అలియా భట్ షూటింగ్ లో జాయిన్ అవ్వగా, అలియా తో నటించేందుకు రామ్ చరణ్ మళ్లీ సెట్స్ లోకి రావాల్సి ఉంది. అయితే వీరిద్దరి కలయిక లో ఉన్న సీన్స్ సినిమా కి హైలెట్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కథనాయికగా ఒలివియా మోరిస్ జంటగా నటిస్తున్నారు. రామ్ చరణ్ సీతారామరాజు పాత్ర లో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరి టీజర్స్ ఇప్పటికే యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.