“రామరాజు ఫర్ భీమ్” చెప్పిన టైమ్ కే అంటున్న రామ్ చరణ్

Wednesday, October 21st, 2020, 12:48:24 PM IST

RRR_movie_update

రౌద్రం రణం రుధిరం చిత్రం ను జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు అంటూ జూనియర్ ఎన్టీఆర్ విడియో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అభిమానులకు మర్చిపోలేని రోజుగా నిలిచింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కి అదే తరహాలో వీడియో కావాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి విపత్తు కారణంగా కాస్త ఆలస్యం అయింది.

అయితే ఇటీవల చిత్ర షూటింగ్ పునః ప్రారంభం చేస్తూ టీమ్ ఒక వీడియో ను విడుదల చేయడం మాత్రమే కాకుండా రామరాజు ఫర్ భీమ్ వీడియో ను అక్టోబర్ 22 న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విషయాన్ని వెల్లడించింది. అయితే రామ్ చరణ్ టైమ్ కి చెప్పిన విధంగా రేపే ఇస్తా అంటూ సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేశారు. అయితే అభిమానులకు మాత్రం గూస్ బంప్స్ పక్కా అనే తరహాలో వీడియో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అలియా భట్, ఓలివియా కథానాయికలు గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తుండగా, పాన్ ఇండియన్ మూవీ గా ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.