నేను 100% న్యాయం చేశాను.. స్పైడర్ ఫెయిల్యూర్ పై రకుల్ కామెంట్స్

Sunday, November 5th, 2017, 11:05:12 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ ఆయినా ఆ ఛాన్సును అస్సలు మిస్ చేసుకోదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా డేట్స్ అడ్జెస్ట్ చేసి మరి ఒప్పేసుకుకోవడం ఖాయం. అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మొదట స్పైడర్ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషించింది. అసలైతే ముందుగా బ్రహ్మోత్సవం సినిమాలోనే అమ్మడికి అవకాశం వచ్చింది. కానీ అప్పుడు మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉండడంతో ఛాన్సును వదిలేసుకుంది.

కానీ మహేష్ స్పైడర్ లో ఫైనల్ గా అవకాశం దక్కించుకుంది. ఇక మురగదాస్ దర్శకుడు కావడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. కానీ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో రకుల్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. అయితే ఎక్కడా కూడా ఇప్పటివరకు స్పైడర్ రిజల్ట్ గురించి ప్రస్తావించలేదు. అయితే తాను నటించిన ఖాకి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా రకుల్ ఈ వియషంపై స్పందించింది. ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా కూడా అనుకున్నంతగా రిజల్ట్ రాకపోవచ్చు. ఒక్కోసారి ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. నేనైతే నా ప్రతి సినిమాకు 100% న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. స్పైడర్ సినిమాకు కూడా అదే స్థాయిలో వర్క్ చేశాను అని రకుల్ వివరించింది.