ర‌కుల్‌కి ఇంట‌ర్నేష‌న‌ల్ జిమ్ కోచ్

Saturday, September 22nd, 2018, 03:19:24 AM IST

అందాల క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ కెరీర్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఇబ్బందుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్స్ అయితే లేవు. అయితే దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌న్న సూత్రాన్ని పాటిస్తూ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 45 పేరుతో ఫిట్‌నెస్ జిమ్ముల్ని ప్రారంభించి ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా ర‌కుల్ దూసుకుపోతున్న‌ సంగ‌తి తెలిసిందే. గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌లో త‌న‌కు ఉన్న క్రేజును తెలివిగా ఎన్‌క్యాష్ చేసుకుంటోంది.

ఇక‌పోతే ర‌కుల్ ప్రీత్ కేవ‌లం జిమ్ముల వ్యాపారంలో ప్ర‌వేశించ‌డ‌మే కాదు.. తాను మ‌గువ‌లంద‌రికీ స్ఫూర్తిగా నిల‌వాల‌నుకుంటోంది. అందుకోసం నిరంత‌రం జిమ్ముల్లో క‌ఠిన వ్యాయామం చేస్తూ తీరైన దేహ‌శిరుల్ని మెయింటెయిన్ చేస్తోంది. ఇటీవ‌లి కాలంలో ర‌కుల్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఊహించ‌ని రీతిలో అల్ట్రా స్లిమ్ లుక్‌లో అద‌ర‌గొట్టేస్తోంది. ఇక‌పోతే జిమ్‌లో త‌న‌కు ట్రైన‌ప్ చేసేందుకు ప్ర‌త్యేకించి ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ కోచ్ ని నియ‌మించుకుంది. త‌న కోచ్‌, డాడ్‌తో క‌లిసి ఉన్న‌ ఫోటోని ర‌కుల్ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేసింది. డాడ్ రాజేంద‌ర్ సింగ్ త‌న‌కు బాస‌ట‌గా నిలిచార‌ని, ఆ ఇద్ద‌రి వ‌ల్ల‌నే తాను ఇలా ఫిట్ గా మారుతున్నాన‌ని ర‌కుల్ ఆనందంగా చెప్పుకుంటోంది. ఇక కెరీర్ ప‌రంగా చూస్తే ర‌కుల్‌కి `ధ్రువ` త‌ర్వాత వేరొక ఆఫ‌ర్ లేదు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఓ అతిధి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అటు కోలీవుడ్‌లో మాత్రం వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. సూర్య స‌ర‌స‌న `ఎన్‌జీకే` లాంటి క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తోంది. కార్తి, శివ‌కార్తికేయ‌న్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ కోలీవుడ్‌లో బిజీగా ఉంది. మ‌రోవైపు బాలీవుడ్‌లో అజయ్ దేవ‌గ‌న్ స‌ర‌సన ఓ చిత్రానికి సంతకం చేసింది. అదీ ర‌కుల్ గ్రాఫ్‌.