ఏపీ సీఎం జగన్‌కు మరో షాక్ తగిలింది. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి నేటి వరకు ఏదో ఒక సంక్షేమ పథకాలను ప్రారంబిస్తూ వాటి నుంచి ప్రజలు లబ్ధి పొందేలా చూస్తున్నాడు. ఈ తరుణంలో పలు కార్పోరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్ళిస్తున్నారంటూ జగన్ ప్రభుత్వంపై అభ్యంతరాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు జగన్ సర్కార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్ళిస్తుందంటూ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు. ఈ కారణంగా రాష్ట్ర ఆర్థిక పురోగతి కుంటుపడటమే కాకుండా అభివృద్ధి కూడా క్షీణిస్తుందని లేఖలో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఆర్బీఎం లిమిట్స్‌ను దాటి కూడా సంక్షేమ పథకాలకు ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని సురేష్ ప్రభు లేఖలో సూచించారు.