బిగ్ న్యూస్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ…కీలక ప్రకటన

Thursday, December 3rd, 2020, 01:29:02 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. 2021 జనవరి నెలలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు గురువారం నాడు తలైవా సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. అయితే పార్టీ కి సంబందించిన పూర్తి వివరాలు డిసెంబర్ 31 వ తేదీన వెల్లడిస్తా అని రజినీ కాంత్ తెలిపారు. అయితే రజినీ కాంత్ చేసిన ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీ కాంత్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం తో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది.

ఇప్పటికే రజినీ కాంత్ ఇటీవల రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులతో సోమవారం నాడు సమావేశం అయిన సంగతి తెలిసిందే. చెన్నై లోని రాఘవేంద్ర కల్యాణ మండపం లో ఈ సమావేశం జరిగింది. వీలైన త్వరగా తన నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన రజినీ కాంత్, గురువారం నాడు చేసిన ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విలువలతో కూడిన, పారదర్శకమైన రాజకీయాలకు రజినీ కాంత్ నిలుస్తారు అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.