రజినీకాంత్ పార్టీ కి తేదీ ఖరారు?

Tuesday, December 22nd, 2020, 10:24:51 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారు అయిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 31 న ఇందుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడిస్తానని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి లో పార్టీ కి సంబంధించిన విషయాలను ప్రజలకు తెలుపుతానని తెలిపారు. అయితే ఇప్పటికే పార్టీ పేరు మరియు గుర్తు ల పై సోషల్ మీడియా లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వచ్చే నెల 14 వ తారీఖున లేదా 17 వ తేదీన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళులకు పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ రోజున 14 వ తేదీకి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే ఎం జి ఆర్ పుట్టిన రోజున ప్రకటించే అవకాశం ఉంది. అయితే రజినీకాంత్ బీజేపీ కి వ్యతిరేకంగా ఉంటారా లేదంటే మద్దతు ఇస్తారా అనే విషయం పట్ల ఇంకా ఉత్కంఠ నెలకొంది.