సమస్యలకు హింసా, అల్లర్లు పరిష్కారం కావు… రజినీకాంత్

Saturday, December 21st, 2019, 03:08:02 PM IST

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ సరఫరా చట్టానికి వ్యతిరేకంగా మొత్తం దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలపై, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్రమైన ఆవేదనని వ్యక్తం చేస్తూ, కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. కాగా గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై తమిళ నటుడు రజనీ స్పందించారు. కాగా ఈ ఆందోళనలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని, ఎలాంటి సమస్యలకైన అల్లర్లు, హింసా పరిష్కారం కాకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చారు.

కాగా రజినీకాంత్ చేసినటువంటి ఈ ట్వీట్ కి కొందరు మద్దతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం తప్పుబడుతూ కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ‘ఐ స్టాండ్ విత్ రజనీకాంత్’ హ్యాష్‌ట్యాగ్‌తో రజనీ అభిమానులు, కొందరు నెటిజన్లు రజినీకాంత్ కి మద్దతు ప్రకటిస్తుండగా, ‘షేమ్ ఆన్ యు సంగి రజని’ హ్యాష్‌ట్యాగ్‌తో వ్యతిరేకులు రజినీకాంత్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా రజినీకాంత్ చేసిన ఈ వాఖ్యలు ప్రస్తుతానికి సామజిక మాంద్యమాల్లో వైరల్ గా మారాయి…