నిన్నటికంటే మరింత మెరుగ్గా రజినీ ఆరోగ్యం

Saturday, December 26th, 2020, 12:12:27 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే. అస్వస్థకి గురి కావడం పట్ల అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిన్నటి కంటే మరింత మెరుగ్గా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. రజినీకాంత్ ఆరోగ్యం పై అపోలో వైదులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

నేడు రజినీకాంత్ కి మరి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, సాయంత్రం వరకు అందుకు సంబంధించిన నివేదికలు వస్తాయి అని తెలిపారు. అయితే ప్రస్తుతం రక్తపోటు హెచ్చు తగ్గులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే పూర్తి గా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన విషయాన్ని వెల్లడించారు. రజినీకాంత్ ను పరామర్శించేందుకు ఎవరూ కూడా రావొద్దు అంటూ వేడుకొన్నారు. రజినీ కాంత్ సినిమా షూటింగ్ లో ఉండగా అనారోగ్యం కారణంగా అపోలో లో చేరగా, రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉందనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరగా ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తానని తెలిపారు రజినీకాంత్.