రజినీ ఇంటి ముందు నిప్పంటించుకున్న అభిమాని…కారణం ఇదే!

Friday, January 1st, 2021, 11:10:34 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పట్ల తమిళనాడు ఎంతో ఆసక్తి కనబరిచింది. సౌత్ లోనే తిరుగులేని సూపర్ స్టార్, రాజకీయాల్లో కూడా తన సత్తా చాటేందుకు పార్టీ ప్రకటిస్తా అంటూ అనారోగ్యం కారణంగా తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. అయితే రజినీ కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు అనడం తో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల రాజకీయాల్లోకి రావడం కుదరదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అయితే రజినీకాంత్ తీరు పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రజినీకాంత్ దిష్టి బొమ్మలు తగలబెట్టడం నుండి నిరసనలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇంటి ఎదుట సైతం అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఒక అభిమాని ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. రజినీకాంత్ నిర్ణయం ఉపసంహరించు కోవాలి అంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తి ను మురుకేసన్ గా గుర్తించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు. అయితే రజినీకాంత్ నిర్ణయం పట్ల ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.