సీపీ సజ్జనార్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..!

Thursday, January 7th, 2021, 04:38:21 PM IST

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి సవాల్ విసిరారు. ఇదివరకే గోవుల అక్రమ తరలింపు విషయంలో పోలీసుల తీరుపై రాజాసింగ్ మండిపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై నేడు మరోసారి మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. బహుదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తున్న వీడియోలను కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ బయట పెట్టారు.

అంతేకాదు చెక్ పోస్టులు పెట్టి గోవులను తరలింపును అడ్డుకోండని, మీకు చేతకాకపోతే అనే పదాన్ని కమీషనర్ కాబట్టి మీపై గౌరవంతో ఆ మాట అనడం లేదని రాజాసింగ్ అన్నారు. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేదంటే నేనే స్వయంగా ఆవుల తరలింపును అడ్డుకుని పట్టుకున్న లారీలను ప్రజల ముందు ఉంచుతానని అప్పుడు మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాజాసింగ్ అన్నారు.