RRR షూటింగ్ పునః ప్రారంభించేందుకు సిద్దం అవుతున్న జక్కన్న!

Wednesday, September 23rd, 2020, 07:30:30 PM IST

దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం చిత్రం షూటింగ్ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే పునః ప్రారంభం అయ్యేందుకు ప్రస్తుతము సిద్దం గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది. అందుచేత చిత్ర యూనిట్ ఐశోలేశన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తగు జాగ్రత్త చర్యలు ఆరోగ్యం అంతా సెట్ అయిన అనంతరం షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే రాజమౌళి అక్టోబర్ రెండవ వారం నుండి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ విడుదల ఉంటుంది అని ఇది వరకే చిత్త యూనిట్ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్న సంగతి తెలిసిందే.