ఎమ్మెల్యే రఘునందన్ పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం

Tuesday, November 17th, 2020, 04:28:17 PM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక లో విజయం సాధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పై రాజా రమణి అత్యాచార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాడు ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటుగా పలువురు పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారు అని ఆరోపించారు.అయితే 20 ఏళ్లుగా ఈ అత్యాచారం కేసులో న్యాయం జరగాలి అని తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు అని తెలిపారు.

అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు పై, వేదింపులకు గురి చేస్తున్న అధికారుల పై, ఆర్ సి పురం పోలీసుల పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే న్యాయం జరగడం లేదు అనే నిరసన తో ఆత్మహత్య కి పాల్పడుతున్నట్లు తెలిపారు. అయితే కాఫీ లో మత్తు మందు కలిపి తన పై అత్యాచారం చేశాడు అంటూ రాజా రమణి గతంలో ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను రఘునందన్ భయపెట్టి లోంగదేసుకుంటాడు అని అప్పుడు ఆరోపించారు.