మొత్తానికి మరో సినిమాను పట్టేసిన రాజ్ తరుణ్ ?

Friday, August 31st, 2018, 10:53:13 AM IST

వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న రాజ్ తరుణ్ కు ఈ మధ్య చేసిన సినిమాలన్నీ ప్లాపులతో టెన్షన్ పెట్టాయి. దాంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఇక రాజ్ తరుణ్ పని అయిపోయిందని అనుకున్నారు అందరు .. కానీ తాజాగా రాజ్ తరుణ్ కు మరో ఛాన్స్ దక్కింది. అయన నవీన్ మేడారం దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. బాబు బాగా బిజీ సినిమాతో నవీన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తాజాగా నవీన్ ఓ కథను రాజ్ తరుణ్ కు వివరించాడని .. కథ నచ్చడంతో అయన ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయిని, వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందట. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయినా రాజ్ తరుణ్ కు మంచి క్రేజ్ పెరిగింది. ఆ తరువాత చేసిన సినిమాలన్నీ ఒకే మూసలో రాజ్ తరుణ్ నటన ఉండడంతో ఆడియెన్స్ కు బోర్ కొట్టేసింది. అందుకే అయన సినిమాలన్నీ ఈ మధ్య వరుసగా ప్లాప్స్ అయ్యాయి.