“రాహుల్ మోడీ 420” ట్రెండ్ అవుతోంది గా!

Wednesday, August 5th, 2020, 12:24:03 AM IST

రాహుల్ మోడీ అనే విద్యార్థి యూపీ ఎస్ సి పరీక్షలో 420 ర్యాంక్ సాదించారు. అయితే ఇపుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మాత్రమే కాక, ట్రెండ్ అవుతోంది. భారతీయ జనతా పార్టీ కి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ మరియు జాతీయ ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరు పేర్ల తో కలిపి రాహుల్ మోడీ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఇద్దరు 420 అంటూ ఫన్నీగా మేమే స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.

యూపీ ఎస్ సి లో 2019 కి గానూ నేడు ఫలితాలు రాగా, రాహుల్ మోడీ cse విద్యార్థి, ఆ వ్యక్తి 420 ర్యాంక్ తెచ్చుకోవడం పట్ల అందరూ రాహుల్, మోడీ ల పై సెటైర్స్ వేస్తున్నారు. అయితే కొందరు మాత్రం టాపర్ కంటే కూడా ఇతనికే ఎక్కువగా క్రేజ్ ఏర్పడింది అని అంటున్నారు.