పగ్గాలు యువరాజుకు అప్పగించాలి

Saturday, November 1st, 2014, 11:37:48 AM IST


ఏఐసిసి అధ్యక్ష పదవిని సోనియా గాంధి నుంచి రాహుల్ గాంధి అందుకోవాలని..అందుకు ఇదే తగిన సమయం అని కాంగ్రెస్ సీనియర్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నదని.. సోనియా గాంధీ నుంచి రాహుల్ పగ్గాలు అందుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధి పార్టీ అధ్యక్ష పదవిని పొందేందుకు ఇంకా అర్హత రాలేదని అనడం సమంజసం కాదని.. జవహర్ లాల్ నెహ్రు 38 సంవత్సరాల వయసులోనే అధ్యక్షపదవిని చేపట్టారని.. ఇక మౌలానా ఆజాద్ 35సంవత్సరాల వయసులోనే పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారని.. దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఇదే మంచి తరుణమని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నదని.. సంవత్సరం చివరి వరకు.. నమోదు కార్యక్రమం ఉంటుందని.. ఇక 2015లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.