మోడీ ప్రభుత్వం నిద్ర లేవాలి – రాహుల్ గాంధీ

Tuesday, May 18th, 2021, 07:14:29 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. భారత్ లో ఈ మహమ్మారి కారణంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో బాధితులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం లో కరోనా వైరస్ రెండవ దశ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది అని అన్నారు. అయితే యువత పై ఈ రెండవ దశ ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. అయితే తొలి దశ లో వృద్ధుల పై ఎక్కువగా ప్రభావం చూపింది అని వ్యాఖ్యానించారు. అయితే రాబోయే రోజుల్లో మూడవ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే ఈ థర్డ్ వేవ్ ద్వారా పిల్లలకు ఎక్కువగా ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కోవిడ్ మూడవ దశ దృష్ట్యా చిన్నారులకు వైరస్ నుండి రక్షణ అవసరం అని, చిన్న పిల్లలకు వైద్య సేవలు, వాక్సిన్ లని అదించాల్సి ఉంది అని అన్నారు. అయితే భారత్ భవిష్యత్ ను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం నిద్ర లేవాలి అంటూ చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.