పోలీసులు నన్ను పక్కకు తోసి లాఠీ ఛార్జ్ చేశారు – రాహుల్ గాంధీ

Thursday, October 1st, 2020, 06:30:57 PM IST

యూపీ లో హాథ్రస్ ఘటన లో మృతి చెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన కాంగ్రెస్ అగ్ర నేతలను పోలీసులు అడ్డుకోవడం తో పరిస్తితులు ఉద్రిక్తంగా మారాయి.అయితే రాహుల్ గాంధీని పోలీసులు మార్గం మధ్యలో ఆపివేయడం తో అక్కడి యమున ఎక్స్ ప్రెస్ వే వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే రాహుల్ గాంధీ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో ఆయన తీవ్ర స్థాయిలో కేంద్రం పై ధ్వజమెత్తారు.

అయితే పోలీసులు తనను పక్కకు తీసి లాఠీ ఛార్జ్ చేశారు అని, పోలీసులు తనను ఏ చట్టం ప్రకారం అడ్డుకున్నారు అనేది చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాక ఈ దేశంలో నడి చేందుకు కూడా అవకాశం లేదా అని సూటిగా ప్రశ్నించారు. కేవలం ఆర్ ఏసెస్ మరియు బీజేపీ నేతలు మాత్రమే రోడ్డు పై నడవాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే పోలీసులు మాత్రం సెక్షన్ 188 కింద అరెస్ట్ చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం తో పలు చోట్ల కేంద్రం తీరు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.