మంత్రి కొడాలి నానికి అల్టీమేట్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ రఘురామ..!

Thursday, September 24th, 2020, 04:25:43 PM IST

ఏపీ మంత్రి కొడాలి నాని దేవాలయాలపై, విగ్రహాల ద్వంసంపై చేసిన వ్యాఖ్యలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు అల్టీమేట్ కౌంటర్ ఇచ్చారు. నేడు ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎవరైనా సరే మన ఇంట్లో పెట్టుకున్న ఇష్టమైన వ్యక్తులు, లేక దేవుళ్ల ఫోటోలపై ఉమ్మివేసి ఫోటోనే కదా ఇంకొక ఫోటో ఇస్తాలే అంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

అయితే హిందూ దేవాలయాలపై విగ్రహాలను పగులగొట్టి ఇంకొకటి పెడదామని అంటున్నారని మండిపడ్డారు. రథం దగ్ధం అయితే కొత్తది చేయిస్తున్నాం కదా అని మాట్లాడడం సబబు కాదని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం యోగిపై కొడాని నాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. వారి గురుంచి తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.