బిగ్ న్యూస్: హైకోర్టు ను ఆశ్రయించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు…కారణం ఇదే!

Friday, July 3rd, 2020, 04:26:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరు పై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ కి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే పార్టీ అనర్హత వేటు మరియు సస్పెన్షన్ ల ప్రక్రియ అడ్డుకోవాలి అని రఘురామ కృష్ణంరాజు హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది.అయితే తాను పేర్కొన్న లేఖలో తను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకి పాల్పడలేదు అని వ్యాఖ్యానించారు.

అంతేకాక రఘురామ కృష్ణంరాజు తాను గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని, వైయస్సార్ పార్టీ కాదు అని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పట్ల తాను ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన విషయం ను అందులో తెలిపారు. అంతేకాక ఈసీ ఒక నిర్ణయం తీసుకొనే వరకు తన పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా చర్యలు అడ్డుకోవాలి అని హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం కార్యకలాపాలు కొనసాగిస్తున్న కార్యాలయాల్లో కూడా కరోనా విజృంభిస్తుండటంతో హైకోర్టు సైతం ముఖ్యమైన కేసులను మాత్రమే, అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విచారణ జరుపుతుంది. అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ సోమవారం నాడు విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.