బుద్ధున్నోడు ఎవరూ అలా అడగరు.. ఎంపీ రఘురామ సీరీయస్ కామెంట్స్..!

Friday, October 23rd, 2020, 06:31:00 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా మూడు రాజధానులు కోరుతూ కొంతమంది ఆటోలలో వచ్చి నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నేడు మీడియాతో మాట్లాడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కర్నూల్‌లో ఒక రాజధాని, విశాఖలో ఒక రాజధాని కావాలని బుద్ధున్నోడు ఎవడైనా అడుగుతాడా అని ప్రశ్నించారు.

అంతేకాదు అమరావతి ప్రజలే వచ్చి కర్నూల్‌లో ఒక రాజధాని, వైజాగ్‌లో ఒక రాజధాని కావాలని అడగరని అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా ఇది ఖచ్చితంగా పెయిడ్ ఆర్టిస్టుల పనే అని, ఇంగిత జ్ఞానం ఉన్నోళ్లకి ఇది చాలా ఈజీగా అర్థమవుతోందని అన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులలో ఒకరు పెయిడ్ ఆర్టిస్టుల సప్లయిర్ ఉన్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధే జూనియర్ ఆర్టిస్ట్ రోల్ తీసుకున్నారన్నారని అన్నారు. ఆటోలో వెళ్లే వారికి ఎందుకు వెళుతున్నారో కూడా తెలీదని అన్నారు.