రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు – ఎంపీ రఘురామకృష్ణంరాజు

Thursday, September 10th, 2020, 04:42:51 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదే చెప్పిందని రాజధానిపై రాష్ట్రాలదే నిర్ణయమని, రాష్ట్రం ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుందని అన్నారు. అయితే కేంద్రం చెబుతున్న సమాధానాలపై రైతులు, మహిళలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

అయితే రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మార్చడం కుదరదని, రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని పేర్కొన్నారు. అఫిడవిట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే గుర్తించడం జరిగిందని, శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులో అసలు విశాఖ పేరులేదని అన్నారు. హైకోర్టు కూడా రాయలసీమకు తరలిపోదని అమరావతిలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతర్వేది ఘటనపై నిరసనగా, దేవాలయాల పరిరక్షణకై రేపు 8 గంటలపాటు తాను కూడా దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించాడు.