బెదిరిస్తే నేను భయపడను.. ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు..!

Wednesday, September 16th, 2020, 07:45:49 PM IST

MP-Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు మీడియాతో మాట్లాడుతూ తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై ఫైర్ అయ్యారు. రాయలసీమలో కూర్చొని ఖబడ్దార్‌ అంటే నేను భయపడనని అన్నాడు. రాయలసీమలో పశుగ్రాసం కొరత ఎక్కువ కనుక నా దిష్టిబొమ్మలను కాల్చడానికి వాడే కంటే ఆ గడ్డిని పొదుపుగా వాడండి అని చెప్పారు. వైసీపీ ఎంపీల సమావేశానికి తనను పిలవకపోవడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నాడు.

ఇదిలా ఉంటే ఏపీలో దేవాలయాలకు భద్రత లేకుండా పోయిందని అంతర్వేది రథం దగ్ధమైన ఘటన మరువకముందే విజయవాడ సాయిబాబా ఆలయంలో విగ్రహం పడగొట్టడం, దుర్గగుడిలో మూడు సింహాలు మాయమవ్వడం నిజంగా ప్రభుత్వ నిర్లక్షమే అని తెలుస్తుందని అన్నారు. దేవాలయాలపై దృష్టిపెట్టే మంత్రిని నియమిస్తే మేలని అన్నారు. ఇక అమరావతి భూముల మీద సిట్‌ విచారణపై స్టే విధించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు తెలిపాడు. చుట్టూ ఉన్న వారు చేసే పనుల వలన సీఎం జగన్‌కు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.