సీఎం జగన్ అనుమతిస్తే వారి పేర్లు బయటపెడతా.. రఘురామ సంచలనం..!

Tuesday, December 15th, 2020, 02:00:18 AM IST

Raghuramkrishnamraju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ దగ్గరగా ఉండే కొందరు నేతలు డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. అయితే రఘురామకృష్ణం రాజు ఇటీవల ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే తన హార్ట్ ఆపరేషన్ మీద వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా విభాగం ట్రోల్ చేసిందని రఘురామ ఆరోపించారు.

అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నిప్పులు చెరిగిన రఘురామ జగన్‌కు దగ్గరగా ఉండే నేతలు ‘డ్రగ్స్’ వాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు కొందరు మానసిక జబ్బుల కోసం ‘సైకోట్రోపిక్‌ డ్రగ్స్‌’ వాడుతున్నారని దీనికి సంబంధించి తన దగ్గర పక్కా సాక్ష్యాలు కూడా ఉన్నాయని, జగన్‌ అనుమతిస్తే వారి పేర్లు బయటపెడుతానని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. అయితే నేను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యానని కొంతమంది వైసీపీ సోషల్ మీడియా వాళ్లు నా మీద చీప్ పబ్లిసిటీ చేస్తున్నారని మీ అందరి ప్రార్థనల వల్ల నేను హ్యాపీగానే ఉన్నా, కోలుకుంటున్నా అని రఘురామ ట్వీట్ చేశారు.