పులిని చూసి నక్క వాతపెట్టుకుంది.. జగన్‌పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటైర్లు..!

Sunday, August 2nd, 2020, 03:00:41 AM IST


వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర దుమారం రేపుతూ సంగతి తెలిసిందే. ఏదో ఒక విషయంలో సొంత పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ వస్తున్న రఘురామ కృష్ణంరాజు అప్పుడప్పుడు జగన్‌పై కూడా విరుచుకుపడుతున్నారు.

అయితే తాజాగా మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో దీనిపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు అమరావాతి విషయంలో సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని, అమరావతిలో ఇల్లు, పార్టీ ఆఫీసు కట్టుకున్న జగన్‌ను చూసి అమరావతిపై ఆయనకు చిత్తశుద్ధి ఉందనుకున్నా అని అన్నారు. దక్షిణాఫ్రికాను చూసి ఏపీలో మూడు రాజధానులు పెట్టడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అని, 3 రాజధానులపై వైసీపీ ప్రజాప్రతినిధులకు ఓటింగ్ పెట్టాలి అని అన్నారు.