సీఎం జగన్ డిక్లరేషన్ పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలి – వైసీపీ ఎంపీ

Saturday, September 19th, 2020, 05:00:18 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ నేత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరొకసారి రాష్ట్ర లో జరుగుతున్న పరిణామాల పై భగ్గుమన్నారు. అయితే అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్ అవసరం లేదు అన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టాకే శ్రీవారి ను దర్శించుకోవాలి అని సూచించారు. అయితే వెంకన్న కి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు అంటూ ఢిల్లీ లో మీడియా తో తెలియజేశారు.

అయితే తిరుమల లో ఆలయ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. అయితే ఈ మేరకు టీటీడీ నిధులను ప్రభుత్వ బాండ్ల లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు అని, అంతేకాక టీటీడీ నిర్ణయాలు సరిగా లేవు అని, దేవుడి సొమ్మును దోచేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే తన మానసిక ఆరోగ్యం బాగోలేదు అని అన్నవారి మానసిక ఆరోగ్యం బాగోలేదు అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తను రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని, తన పై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు అంటూ మరొకసారి తేల్చి చెప్పారు.