దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రఘునందన్‌ రావు

Wednesday, November 18th, 2020, 06:30:39 PM IST

ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఛాంబర్‌లో రఘునందన్‌ రావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు పాల్గొని రఘునందన్‌ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,070 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మొత్తం మీద బీజేపీకి 62,772 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 61,302 ఓట్లు, కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు పోలయ్యాయి. అయితే దుబ్బాకలో గెలవడంతో అదే ఊపుతో జీహెచ్ఎంసీలో కూడా బీజేపీ పాగా వేయాలని చూస్తుంది.