రాజధానిపై రైతుల అభిప్రాయం తీసుకోండి.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు డిమాండ్..!

Sunday, July 5th, 2020, 03:00:33 AM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజులకు చేరుకుంది . దీనిపై స్పందిస్తూ రైతులకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంఘీభావం తెలిపారు.

అయితే రాజధానిపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల అంకితభావం గొప్పదని, రోజూ గమనిస్తున్నానని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, ప్రభుత్వాలు కొనసాగుతుంటాయన్నారు. వైసీపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి కొనసాగుందని అన్నారని, నిండు సభలో జగన్ కూడా అదే చెప్పారని గుర్తు చేశారు. 3 రాజధానులపై ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.