ఫెడరల్ ఫ్రంట్ పెట్టండి.. సీఎం కేసీఆర్‌కు ఆర్. నారాయణమూర్తి విజ్ణప్తి..!

Saturday, March 20th, 2021, 03:00:55 AM IST


తెలంగాణ సీఎం కేసీఅర్‌కి పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా ఓ విజ్ణప్తి చేశాడు. నేడు నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో సీపీఐఎంఎల్, న్యూడెమెక్రసీ ఆధ్వర్యంలో జరిగిన రైతు పోరు గర్జన సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులని కేంద్రం మింగేస్తోందని ఆరోపించారు. కొత్త చట్టాలు రైతులకు వరాలు అని కేంద్రం చెబుతుందని, కానీ అవి రైతుల పాలిట ఉరితాళ్లు అని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.

అయితే సీఎం కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని, ప్రధాని మోడీ, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయండని విజ్ణప్తి చేశారు కేంద్రం తెచ్చిన చట్టాలు కేవలం వ్యాపారస్తుల కోసమేనని, రైతుల కోసం కాదని ఆరోపించారు. అయితే రీతులకు కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనని, కనీస మద్దతు ధర ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక ఒకే దేశం ఒకే చట్టం కూడా వద్దని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.