ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ఆర్ నారాయణ మూర్తి డిమాండ్..!

Thursday, April 8th, 2021, 02:14:58 AM IST


విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్‌టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఆర్. నారాయణమూర్తి డిమాండ్ చేశారు. సినిమాల్లో నటన పరంగా, రాజకీయాల్లో మంచి నేతగా ఎన్‌టీఆర్ తెలుగు ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారని అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆర్. నారాయణమూర్తి నిలదీశారు. తమిళ నటుడు ఎంజీఆర్ కంటే ఎన్‌టీఆర్, బాపు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి భారతరత్నకు అర్హులని వీరందరిని ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలని, భారతరత్న వంటి మహా గుర్తింపుకు తెలుగువారిని గుర్తించకపోవడం నిజంగా దౌర్భాగ్యమైన పని అని ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.