సర్కారు బడుల్లో ఆంగ్ల భోధన పై సినిమా తీస్తా… నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు

Monday, December 7th, 2020, 04:06:19 PM IST

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కారు బడుల్లో ఆంగ్ల భోధన అవశ్యకత, యూనివర్సిటీ ల్లో విద్యా భోధన తీరు, విద్యార్థుల నడవడిక మరియు తదితర అంశాల పై సినిమా తీస్తా అని నారాయణ మూర్తి అన్నారు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈ కొత్త సినిమా కి శ్రీకారం చుడతా అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

అయితే ఆదివారం నాడు మీడియా ప్రతినిధుల తో మాట్లాడిన నారాయణ మూర్తి , తన చిత్రం సామాజిక అంశాల తో కూడిన సందేశాత్మక చిత్రం గా ఉంటుంది అని స్పష్టం చేశారు. అయితే మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం సినిమా పరిశ్రమ పై చాలా ఎక్కువగా చూపించింది అని అన్నారు. అయితే ఈ మహమ్మారి కారణం గా సినిమా వాయిదా పడింది అన్నట్లుగా నారాయణ మూర్తి వివరించారు. అంతేకాక తను తీయబోయే సినిమాను విశాఖ పట్టణం మరియు విజయనగరం జిల్లాల్లోనే చిత్రీకరిస్తా అని అన్నారు.