మహిళలకు ఆ లీవ్ ఇవ్వండి.. జగన్ సర్కార్‌కు పీవీపీ డిమాండ్..!

Tuesday, August 11th, 2020, 09:40:38 AM IST

వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత పీవీపీ జగన్ సర్కార్‌కు ఓ ఆసక్తికర డిమాండ్ వినిపించారు. మహిళా ఉద్యోగులకు పీరియడ్ లీవ్ ఇవ్వాలంటూ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను కోరారు.

మాట్లాడకుండా గుట్టుగా ఉంచుతూ బాధపడే రోజులు కావు అని,
జోమాటో సంస్థ ఆడవారికి సంవత్సరానికి పదిరోజులు లీవ్ ప్రకటించి వారు పడే ఇబ్బందుల నుంచి సహకారం అందించిందని, బీహార్ ప్రభుత్వం కూడా నెలకు ఆడవారికి రెండు రోజుల సెలవు ఇచ్చిందని అన్నారు. మన రాష్ట్రంలో కూడా అదే విధంగా పనిచేసే మహిళా ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని పీవీపీ కోరారు.