మంత్రి పువ్వాడ అజయ్ కి సోకిన కరోనా

Tuesday, December 15th, 2020, 11:30:28 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే దీని తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు తాజాగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ప్రస్తుతం పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ లోని తన నివాసం లో స్వీయ నిర్బంధం లో ఉన్నట్లు వివరించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి నుండి కోలుకొని త్వరగా యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా అని అన్నారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు అంతా కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు.