డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Tuesday, November 3rd, 2020, 02:31:15 PM IST

తెలంగాణ రాష్ట్రం లో పలు చోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఖమ్మం జిల్లా, రఘునాథ పాలెం మండలం, మంచుకొండ గ్రామం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. 1.51 కోట్ల రూపాయల తో 30 ఇళ్లను ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజా సంక్షేమం కి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని, నిరుపేదల అవసరానికి నివాసాలను నిర్మించి ఇస్తుంది అని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండేలా కృషి చేస్తున్నాం అని అన్నారు. రైతు సంక్షేమం కి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం కేసీఆర్ అధ్వర్యంలో అవసరమైన కార్యాచరణ రూపొందించి ప్రణాళిక సిద్దం చేస్తున్నాం అని అన్నారు.