ఆచార్య షూటింగ్: చిరు కి ఆతిథ్యం ఇస్తా అంటున్న మంత్రి పువ్వాడ

Friday, February 12th, 2021, 04:34:32 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రం లో నటిస్తున్నారు. అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఖమ్మం లోని షూటింగ్ కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను దర్శకుడు కొరటాల శివ కలిశారు. గనుల్లో సినిమా షూటింగ్ కి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి గారు తనకు షూటింగ్ ఉన్నన్ని రోజులు తన నివాసం లో ఉండాలి అని పువ్వాడ అజయ్ కుమార్ కోరడం జరిగింది.అయితే మంత్రి విజ్ఞప్తి చేయడం తో మెగాస్టార్ చిరంజీవి తన నివాసం లో ఉందనున్నట్లు తెలుస్తోంది.

అయితే మార్చి నెల 7 నుండి 15 వ తేదీ వరకు ఖమ్మంలోని ఇల్లందు లో ఆచార్య సినిమా షూటింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంది. అయితే ప్రస్తుతం జేకే మైన్స్ లో షూటింగ్ కి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు దర్శకుడు కొరటాల శివ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం పర్యాటకం గా అభివృద్ధి చెందుతుంది అని, సినిమా షూటింగ్ లకు అనువైన ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి అని, గతంతో పోల్చితే ఇప్పుడు ఖమ్మం రూపురేఖలు మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు.