రెండు రోజుల క్రితం ఒక బత్తాయి వచ్చింది…ఆయన బీజేపీ అధ్యక్షులు తొండి సంజయ్

Sunday, January 10th, 2021, 04:18:46 PM IST

తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ కి దుబ్బాక మరియు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి సమాధానం ఇచ్చింది బీజేపీ. అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడ తమ పార్టీ ను బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికార పార్టీ తెరాస పై పలు కీలక ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే దీని పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. గట్టి కౌంటర్ ఇచ్చారు.

తాను ఎప్పుడూ కూడా మంత్రి పదవి ఆశించలేదు అని అన్నారు. ఎన్నికల సమయం కావడం తో కొందరు టూరిస్ట్ లు వస్తుంటారు అని, అందులో భాగంగా నే రెండు రోజుల క్రితం ఒక బత్తాయి వచ్చింది అంటూ విమర్శించారు. ఆయన బీజేపీ అధ్యక్షులు తొండి సంజయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రాబట్టేందుకు ఆయన పర్యటించారు అని విమర్శించారు. అయితే తెరాస పై కరోనా వాక్సిన్ ప్రయోగించాము అని చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఖమ్మం లో ఎటువంటి వాక్సిన్ లు కూడా పనిచేయవు అని, వాక్సిన్ వేసినా తిప్పి కొట్టేందుకు ఇక్కడ ప్రజలకి బాగా రోగ నిరోధక శక్తి ఉందని కౌంటర్ ఇచ్చారు. అయితే కూకట్ పల్లి డివిజన్ లో ఏడు స్థానాలకు ఆరు గెలుచుకొని బండి సంజయ్ కి వాక్సిన్ చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఖమ్మం కి బీజేపీ చేసిందేమీ లేదు అని, ఇక్కడ అధికార పార్టీ తెరాస కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొచ్చారు.