పుష్ప వర్కింగ్ స్టిల్ అద్దిరిపోయింది గా!

Thursday, November 12th, 2020, 02:49:26 PM IST

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రం ను దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కేవలం ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానులను ఊరిస్తుంది.

అయితే తాజాగా పుష్ప చిత్రం కి సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్ విడుదల అయింది. అయితే ఈ స్టిల్ లో అల్లు అర్జున్ బ్యాక్ లుక్ తో అదరగొట్టేశాడు. ఈ లుక్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడం తో ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.