మొదలైన సుకుమార్ – అల్లు అర్జున్ “పుష్ప” సందడి!

Tuesday, November 10th, 2020, 11:48:48 AM IST

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయింది. ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయిన విషయాన్ని ఇప్పటికే చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాగా, దర్శకుడు సుకుమార్ సైతం అల్లు అర్జున్ తో షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలో నీ మారెడుమిల్లి ప్రాంతం లో జరుతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే తెలిపారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అలా వైకుంఠ పురం లో చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావడం తో భారీ అంచనాలే నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీ గా ఈ చిత్రం విడుదల కానుంది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత సుకుమార్ మరియు అల్లు అర్జున్ కలిసి పని చేస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకులు ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.