పూరి – విజయ్ సినిమా కి సరికొత్త పేరు… వైరల్ అవుతోంది గా!

Monday, January 18th, 2021, 10:22:54 AM IST

విజయ్ దేవరకొండ హీరో గా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కి లైగర్ గా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రం కి గతం లో ఫైటర్ అనుకోగా, తాజాగా చిత్త యూనిట్ చేసిన ప్రకటన తో పూరి జగన్నాథ్ విజయ్ సినిమా పై ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఈ చిత్రం టైటిల్ తో పాటుగా విజయ్ లుక్ ను కూడా రివీల్ చేశారు చిత్ర యూనిట్. మాస్ లుక్ తో బాక్సర్ గా కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. అటు లయన్, ఇటు టైగర్ లకు క్రాస్ బ్రీడ్ గా లైగర్ అంటూ రిప్రజెంట్ చేశారు టీమ్.

అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా వస్తుండటం తో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాక టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దేవరకొండ ఈ సినిమా కి మరొక అట్రాక్షన్ కాగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ లో పరిచయం కానున్నారు. పాన్ ఇండియా చిత్రం గా రానున్న ఈ చిత్రం తో పూరి జగన్నాథ్ బాలీవుడ్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.