బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరికి కరోనా పాజిటివ్..!

Wednesday, September 30th, 2020, 12:24:19 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే తాజాగా బీజేపీ మహిళా నాయకురాలు పురందేశ్వరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధిష్టానం పురందేశ్వరి పేరును ప్రకటించడంతో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పురంధరేశ్వరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే జ్వరం, దగ్గు ఉండటంతో ప్రస్తుతం ఆమె హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.