కరోనా విషయంలో ‘ సుమ’ గురించి ‘ పురాణపండ శ్రీనివాస్ ‘ అదరగొట్టేసారు

Thursday, March 26th, 2020, 04:31:12 PM IST

అంతర్జాతీయంగా కరోనా కల్లోలంలో బెంబేలెత్తుతున్న వేళలో… ఈ ఆపత్కాల పరిస్థితిలో ధైర్యంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుగు సినీ ప్రముఖులు, రాజకియ ప్రముఖులు ఒక ప్రక్క చెబుతుండగా ….. మరోపక్క ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్’ కరోనా వైరస్ ‘ గురించి యు ట్యూబ్ లో చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మనిషి కండకావరం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని పురాణపండ శ్రీనివాస్ చెప్పిన అద్భుత ప్రసంగాన్ని నెటిజన్లు ‘ సూపర్’ గా ప్రసంసిస్తున్నారు .

ఈ స్పీచ్ లో ప్రముఖ యాంకర్ ‘ సుమ ‘ వ్యాఖ్యల్ని కూడా పురాణపండ శ్రీనివాస్ అద్భుతంగా సమర్ధించడాన్ని సుమ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి , జూనియర్ ఎన్.టి.ఆర్ , రామ్ చరణ్ , మహేష్ బాబు,నాగార్జున, వెంకటేష్ … ఇలా చాలామంది సినీ ప్రముఖులు చేసిన , చెప్పిన జాగ్రత్తలు మనం చూసినా పురాణపండ శ్రీనివాస్ చెప్పిన వీడియో చాలా ఆసక్తిగా ఉండటం విశేషం.

తెలుగునాట మంచి వక్తగా, మహోన్నత గ్రంధాల రచనా సంకలనకర్తగా విశేష ఖ్యాతి సంపాదించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఈ సామాజిక విపత్తు సందర్భంలో స్పందించడాన్ని ప్రభుత్వాధికారులు సైతం అభినందిస్తున్నారు.

‘సూపర్ టాలెంటెడ్’ సుమకి చాలాకాలంగా మంచి స్నేహితులైన ‘స్పాంటేనియస్ స్పీకర్’ పురాణపండ శ్రీనివాస్ ఈ విషయంలో’ సుమ’ ను హ్యాపీగా సమర్ధించడం విశేషం.

ఏది ఏమైనా కోవిడ్ ని కట్టడిలో చేయడమే లక్ష్యంగా సాగుతున్న పోరాటంలో ఒక రచయితగా శ్రీనివాస్ అత్యద్భుతంగా చెప్పిన విషయాన్ని యూట్యూబ్ లో ఒకసారి చూస్తే కొందరు మనుషుల్లో కనీసం మానవీయత పెరుగుతుందని మేధో సమాజం పేర్కొంటోంది.