హైదరాబాద్ లో ప్రారంభం అయిన పవన్ సినిమా!

Monday, January 25th, 2021, 12:49:59 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోవడం తో పవన్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ హీరో గా, రానా దగ్గుపాటి కీలక పాత్రలో మలయాళం లో సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం నాడు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. అల్యూమినియం ఫ్యాక్టరీ లో చిత్రీకరణ లో పవన్ కళ్యాణ్ పాల్గొన నున్నట్లు తెలుస్తోంది. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే, ఇటు వరుస సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం కావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ క్రిష్ తో, హరీష్ శంకర్ లతో పాటుగా, బండ్ల గణేష్ నిర్మాణం లో కూడా చిత్రాలు చేయనున్నారు.