టీఆర్ఎస్ ఎమ్మెలేకి షాక్.. కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన ప్రజలు..!

Thursday, October 15th, 2020, 02:40:31 PM IST

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురయ్యింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో చెరువు నిండటంతో పూజలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే మంచిరెడ్డిని స్థానికులు నిలదీశారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు కొందరిపై లాఠీ ఛార్జ్ చేయడంతో గ్రామస్థులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరారు. మేడిపల్లి గ్రామం ఫార్మాసిటీలో పోతుందని, దీనికి ఎమ్మెల్యేనే కారణమంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు.