ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేసేది అక్కడినుండే

Monday, October 5th, 2020, 05:01:26 PM IST

తెలంగాణ రాష్ట్రం లోపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం లో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీ పై నెగ్గి తీరాలి అని కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలకు చెందిన. ఈతకు సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ నేపధ్యంలో ప్రొఫెసర్ కోదండరాం సైతం ఎమ్మెల్సీ బరిలో నిలబానున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కోదండరాం పోటీ పై ఆ పార్టీ టీ జే ఎస్ క్లారిటీ ఇచ్చింది. కోదండరాం వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటన లో తెలిపింది.

అయితే ఈ పార్టీ కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ తమకు మద్దతు ఇస్తుంది అని పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు. అయితే తెలంగాణ లో కాంగ్రెస్ కూడా బలమైన పార్టీ గా ఎదిగేందుకు మరొకసారి రంగం సిద్దం చేస్తోంది. కోదండరాం కి మద్దతు ఇవ్వడానికి బదులు గా జిల్లాలో బలమైన పార్టీ నేతను బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కోదండరాం కి కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తారో లేదో చూడాలి.