నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో నాకు సంబంధం లేదు

Sunday, November 22nd, 2020, 12:41:25 PM IST

ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సోషల్ మీడియా లో చాలా యాక్టిివ్ గా ఉంటారు. అయితే తన పై సోషల్ మీడియా లో చేస్తున్న వ్యాఖ్యల పట్ల, పోస్టుల పట్ల బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ఏ రాజకీయ పార్టీ లతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు అని బండ్ల గణేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు అని తెలిపారు. ఇది నా అభ్యర్ధన మీ బండ్ల గణేష్ అంటూ సోషల్ మీడియా లో వ్యాఖ్యానించారు.

అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపద్యం లో బండ్ల గణేష్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా లో పలువురు నెటిజన్లు పోస్టులు, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పలు కీలక వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్. ఇపుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ వ్యాఖ్యలు వాడవద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ మరియు తెరాస నువ్వా నేనా అనేంత లా పోటీ పడుతున్నాయి. ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలతో రెచ్చిపోతున్నారు.